శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని వరద బాధిత కుటుంబాలకు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్ ప్రజలకు నిత్యావసర వస్తువులు, కాయగూరలను అందించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేలేరుపాడు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు 3100 కేజీల కాయగూరలు అందించారు. ఉల్లిపాయలు 1150 కేజీలు, బంగదుంపలు 1195 కేజీలు, టమాటాలు 500 కేజీలు, పచ్చి మిరపకాయలు 250 కేజీలు అందించారు. వరద సహాయక కేంద్రాల వద్ద త్రాగునీరు, నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకున్నారు.