మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు జిల్లాలో విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహించాలని ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ASF కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో ఎస్.పి. కాంతిలాల్ సుభాష్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ అదనపు ఎస్.పి. చిత్తరంజన్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి మాదకద్రవ్యాల నివారణపై నషా ముక్తి భారత్ అభియాన్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొమురం భీమ్ ఆసిఫాబాద్ ను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు.