చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశ మందిరంలో శుక్రవారం గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు మేయర్ అముద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.