తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 11 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు మండల సాధన సమితి సభ్యుడు రాజ్ కుమార్ శనివారం తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం తడుకల్ లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఎంపి సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఇచ్చిన హామీ మేరకు తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.