దేవనకొండలో చరిత్ర సృష్టించిన తెర్నేకల్ గ్రామ విద్యార్థులు డీఎస్సీ పరీక్షల్లో ఏకంగా 21 కి పైనే ఉద్యోగాలు సాధించిన తెర్నేకల్ ఊరి ఆణిముత్యాలు. ఆదివారం గ్రామ పెద్దలు వారిని అభినందించారు. తమ కుటుంబాల్లో పేదరికం దగ్గరుండి చూసి, ఉద్యోగాలు సాధించడంతో వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొన్న కానిస్టేబుల్ ఫలితాల లో 6 మంది విద్యార్థులు, మెగా డీఎస్సీ లో ప్రస్తుతం 21 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు.