Araku Valley, Alluri Sitharama Raju | Aug 23, 2025
అరకులోయ మండలం మాడగడ పంచాయతీ దానిరంగని గ్రామంలో సమస్యలు కొలువై ఉన్నాయి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వారు ఆరోపించారు గ్రామంలో సిసి రహదారులు , డ్రైనేజీ తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆరోపించారు ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు అందరూ చందాలు వేసుకొని జెసిబి ని తీసుకొచ్చి రహదారిని చదును చేసుకున్నామని గ్రామస్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.