సూర్యాపేట జిల్లా: పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రతా స్కీం ఒక బాసటగా ఉంటుందని ఎస్పీ నరసింహ మంగళవారం అన్నారు. తిరుమలగిరిలోని పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ మరణించిన రమేష్ రాథోడ్ కుటుంబానికి పోలీసు భద్రత పథకం కింద నగదు చెక్కును మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పంపిణీ చేశారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ఈ పథకం భరోసాగా నిలుస్తుందని తెలిపారు.