సరోగసి పేరుతో మోసం చేసిన సృష్టి ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను శుక్రవారం గోపాలపురం పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్ చంచల్గూడా జైలు నుండి నేరుగా గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిందితురాలు డాక్టర్ నమ్రత మాట్లాడుతూ నేనేమీ తప్పు చేయలేదని తనను ఇబ్బందులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.