భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన వంగలక్ష్మీ, యాదగిరి, ఓదెలు, లక్ష్మి పలు కారణాలతో మృతిచెందగా శనివారం ఉదయం 8 గంటలకు కొంపల్లి గ్రామానికి వెళ్లి గ్రామస్తులు, స్థానిక కార్యకర్తలతో కలిసి చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. చనిపోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.