రాజమండ్రిలో ఈనెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి కొవ్వూరు సైకిల్పై వస్తుండగా గామన్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు పాలైన అతడిని స్థానికులు అంబులెన్స్ లో ఒక ఊరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చక గురువారం రాత్రి మృతి చెందినట్లు సీఐ విశ్వం తెలిపారు.