Parvathipuram, Parvathipuram Manyam | Aug 21, 2025
జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ (MI) ట్యాంకుల కోసం ప్రభుత్వం ఆర్.ఆర్.ఆర్ (Repair, Renovation, Restoration) కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దీని ద్వారా చిన్న నీటిపారుదల మౌలిక సదుపాయాల పరిస్థితి, నిర్వహణను మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలలో కీలకమైన భాగం కానుందని అభిప్రాయపడ్డారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నీటిపారుదల శాఖపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సంబంధించి ట్రిపుల్ ఆర్ ప్రతిపాదనలన్ని సిద్ధం చేయాలన్నారు.