నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తమని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు వరి, పెసర విత్తనాలను శాస్త్రవేత్తలతో కలిసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో నాణ్యమైన విత్తనాలు అందించి రైతన్నకు నేస్తంగా నిలవడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ న