నంద్యాల పట్టణానికి చెందిన పదవ తరగతి చదివే ఓ మైనర్ బాలికపై పట్టణానికే చెందిన సాకే రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఇంటి నుండి తీసుకువెళ్లి వివిధ ప్రదేశాలలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 14.11.2018 సంవత్సరంలో నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సొ కేసు నమోదు చేశారు. సదరూ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం కర్నూలు ఫోక్సో కోర్టు నిందితునికి శుక్రవారం 21 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 35 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు