కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వీరపునాయునిపల్లి పార్టీ కార్యాలయంలో సోమవారం నాయకులు, కార్యకర్తలతో కమలాపురం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి నరేన్ రామానుజల రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీ కాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో అంటూ ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం క్యూఆర్ కోడ్ పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.