వెంకటాచలం సమీపంలో రైలు డీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం 4:00 కి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు నలుపు రంగు కట్ బనియన్, గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నారని రైల్వే పోలీసులు తెలిపారు.