Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
గొడవలకు తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మండపాల నిర్వాహకులతో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో భూపాలపల్లి నరేష్ కుమార్ తో పాటు ఎస్ఐలు సామామూర్తి, రమేష్ పాల్గొన్నారు.