పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. జంపలేరు, గుండ్ల కమ్మ వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కంభం చెరువుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. ఏడు అడుగుల మేర కంభం చెరువులో నీటి నిలువలు ఒక్కసారిగా పెరిగాయి. స్థానిక రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెరువులో నీటి నిలువలు అడుగంటి పోతూ ఉండడంతో ఆందోళన చెందామని ప్రస్తుత కురుస్తున్న వర్షాలు సాగునీటికి ఇబ్బందులు లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. కంభం చెరువులో నీటి నిలువలు పెరిగినట్లుగా స్థానిక అధికారులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు.