కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లెలో విష జ్వరాలు రోజురోజుకు విజృంభిస్తున్నాయని స్థానికులు తెలిపారు. బుధవారం తెల్సిన వివరాల మేరకు వైద్యాధికారులు గ్రామంలో పర్యటించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా... జ్వరాలు అదుపు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ గ్రామంలో 20 రోజులుగా విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దాదాపు 30 నుంచి 40 మంది పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. చాలామంది పిల్లలకు రక్త కణాలు తగ్గిపోవడంతో డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు.