డిప్యూటీ స్పీకర్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పేరు ఖరారు చేయడంతో, ఈరోజు సూర్యాపేట జిల్లాలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన దండు మైసమ్మ తల్లిని, తన సతీమణి ప్రమీల తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తానని, ప్రజల ఆశీర్వాదంతోనే తనకి స్థానం లభించిందని అన్నారు.