షామీర్పేటలోని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసంలో నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై దేశ భద్రత, అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు ఫణిందర్ ఆధ్వర్యంలో ఉప్పల్ డివిజన్ కు చెందిన పలువురు నాయకులకు,యువకులకు బిజెపి కండువా కప్పి ఈటెల రాజేందర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.