కాళేశ్వరం ప్రాజెక్ట్ అవతకలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేసారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్న పాటశాలలో ఏర్పాటు చేసిన రాగి జావా పంపిణి కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. తెలంగాణ పాటశాల విద్యాశాఖ, శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ అద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ పాటశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో, ఉదయం పూట రాగి జావాను అందిస్తున్నారు. ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.