గంజాయి సాగు పై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే పలువురు పై కేసు నమోదు చేయగా, తాజాగా జైనథ్ మండలంలో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు జైనథ్ సీఐ ప్రవీణ్ తెలిపారు. మారుగూడా గ్రామంలోని పంట చెనులో అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్న కృష్ణ వసంతులను అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. వారి నుండి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.మీడియా సమావేశం ఎస్సై గౌతమ్ ఉన్నారు