అనంతపురం నగర శివారులోని చంద్రబాబు కొట్టాల శివారు ప్రాంతంలో గగన్ అనే యువకుడిపై చంద్రబాబు కొట్టాలకు చెందిన ఇమ్రాన్ చిన్నపకీరప్పతోపాటు మరో పదిమంది రాళ్లు కొడవళ్లతో దాడి చేసి గాయపరిచినట్లుగా బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాను కలెక్షన్ చూసుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అడ్డగించి ఏకంగా దాడికి పాల్పడినట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.