వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. బుధవారం పండుగ సందర్భంగా చిట్టి చిట్టి గణనాథులు వివిధ రంగులలో భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఒక్కో విగ్రహం 50 రూపాయల పైబడి అమ్మకాలు సాగిస్తున్నారు. విగ్రహాలను కొనుగోలు చేసేందుకు చిన్నారులు పెద్దలు పెద్ద ఎత్తున దుకాణాలకు వరుస కట్టారు. గతేడాది కంటే ఈ ఏడాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.