మంత్రాలయం: మండలం చట్నహళ్లిలో స్మశాన వాటిక వివాదంపై సోమవారం ఎస్సీ, ఎస్టీ లోకదళత్ జడ్జి లీలా వెంకట శేషాద్రికి జైభీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ వినతిపత్రం సమర్పించారు. మాదిగల పై బీసీల వివక్ష, అక్రమ ఖననాలపై చర్యలు తీసుకోవాలని, రోడ్డు నిర్మాణం ఆపిన అధికారులపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.