నెల్లూరులో వైసీపీ నేతలపై లాఠీచార్జ్ నెల్లూరులోని కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్ద ఉన్న హరిత హోటల్ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు మెయిన్ రోడ్డుకు వచ్చిన కార్యకర్తలను, నేతలను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎక్కువమంది జనాలు రావడంతో అదుపు చేయలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు.