ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఏబీఎం పాఠశాలలో గురువారం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇటువంటి క్యాంపులు ఏర్పాటు చేయడంపై వైద్యులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. విద్యార్థులతో మాట్లాడి వైద్యులు ఎటువంటి పరీక్షలు చేశారో అడిగి తెలుసుకున్నారు. తర్వాత చిన్నారులతో ఎమ్మెల్యే సరదాగా గడిపారు.