ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా తీశారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్ లను మంత్రి అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి... జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశా నిర్దేశం చేశారు.