తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఘటోత్సవం ఘనంగా జరిగింది. యువత పెద్ద సంఖ్యలో ఘటాల వెంబడి వచ్చారు. నాగయ్య కాలేజీకి వెళ్లే దారిలో యువత అత్యుత్సాహం చూపి కుండలను తాకడానికి ప్రయత్నించారు. పోలీసులు ఎంతజెప్పినా వినలేదు. దీంతో వాళ్లు లాఠీకి పనిచెప్పాల్సి వచ్చింది. స్వల్ప లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత యథావిధిగా ఘటోత్సవం కొనసాగింది.