కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని పత్తి రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక జిల్లా నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న పత్తి పై ఉన్న 11 శాతం పన్నును కేంద్ర ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించడంతో మన దేశంలో పండించిన పత్తికి మార్కేట్ ధర ఉండదని. దిని కారణం పత్తి రైతులు సంక్షోభంతో ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు.