సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటనకు రానున్నారు. సెప్టెంబర్ 2 న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 2వ లేదీ ఇడుపులపాయలో తండ్రి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.