అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి శనివారం మరణించాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయనను వైద్యులు చికిత్స చేస్తుండగా మృతి చెందాడు.అతని పేరు, చిరునామా ఇప్పటివరకు తెలిసి రాలేదు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు.ఆ వ్యక్తి ఆచూకీ తెలిసినవారు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించవలసిందిగా కోరారు. వివరాలు తెలిపే వారు 9121100559, 9121100561 నంబర్లకు సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.