విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ను మోటార్ బైక్ బలంగా ఢీకొట్టిన సంఘటనలో మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న విశాఖజిల్లా అచ్చుతాపురం గ్రామానికి చెందిన బొత్స రాము కు తీవ్ర గాయాలయ్యాయి. అచ్యుతాపురం నుంచి రాము మోటార్ బైక్ పై వస్తుండగా రాంబద్రపురం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.