శంకర్పల్లి మండలంలో ఇంటి ముందు కూర్చున్న ఇద్దరిని కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహాలింగపురం గ్రామానికి చెందిన షేక్ మొహిముద్దీన్ వయసు 80 తన బంధువు మొహమ్మద్ ఖాన్ తో కలిసితొ ఆదివారం సాయంత్రం ఇంటి ముందు కూర్చున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన నందీశ్వర్ అనే వ్యక్తి కారు అతని వేగంగా నడిపి యాక్సిడెంట్ చేశాడు. కాగా చికిత్స పొందుతూ షేక్ మొహిముద్దీన్ మృతి చెందాడు.