గుడివాడలో సోమవారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం బోర్డును నిలిపివేసిందని, భవన నిర్మాణ కార్మికులకు చెందిన రూ. 31 వేల కోట్లలో జగన్ ప్రభుత్వం రూ. 1280 కోట్లు, చంద్రబాబు ప్రభుత్వం రూ. 1150 కోట్లు దుర్వినియోగం చేశాయని నాయకులు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే బోర్డును పునరుద్ధరించాలని వారు కోరారు.