భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం సాయంత్రం మాజీమంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నేత అన్నవరపు కిషోర్ మాట్లాడుతూ చంద్రబాబు కుట్ర రాజకీయాలను రానున్న ఎన్నికల్లో బయట పెడతామన్నారు. అన్నదమ్ములుగా ఉండే మాల, మాదిగల మధ్య దూరం పెంచే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు పూనుకున్నాడు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు మాల మహానాడు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.