ఆదోని కుప్పగల్ -ఇస్వి రైల్వే స్టేషన్ మధ్య నిన్న రాత్రి గుల్బర్గా నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్న రైలు నుండి ప్రమాదవశాత్తు జారి కిందపడి గాయాలు అయినట్లు, రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య శుక్రవారం తెలిపారు. ఉదయం ఇస్వి స్టేషన్లో పనిచేస్తున్న లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి గుర్తించి ఆదోని ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించాడన్నారు. గుల్బర్గా ప్రాంతానికి చెందిన శ్రీషయిల్ గా గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు.