హుజురాబాద్: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం హిందీ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న ఇమ్మడి సంపత్ పై కోతులు దాడి చేసి గాయపరిచాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులపై కోతుల గుంపు దాడికి ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించిన సంపత్ కుమార్ చేతిలో ఉన్న కర్రతో కోతులను బెదిరించే ప్రయత్నం చేశాడు దీంతో ఒక్కసారిగా సంపత్ కుమార్ పై కోతులు దాడి చేశాయి దీంతో తీవ్ర గాయాల పాలైన సంపత్ కుమార్ ఆసుపత్రి తరలించారు పాఠశాల ఆవరణలో ప్రతిరోజు కోతుల గుంపు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయని అధికారులు స్పందించి కోతుల బారి నుండి కాపాడాలని విద్యార్థులు పట్టణవాసులు కోరుతున్నారు.