మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మట్టి గణపతి లను పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, పోస్టర్ ఆవిష్కరించి, కలెక్టరేట్ ఉద్యోగులకు, సిబ్బందికి ప్రజలకు మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ కాలుష్య నియంత్రణ కోసం,ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని, కాలుష్యం నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు,