తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) ఆధ్వర్యంలో బుధవారం గోడ పత్రికల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కార్యదర్శి లోకేష్ పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పైబడుతున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ వసతి గృహ విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలను 300 పెంచాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐ.టి కాలేజీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్