పార్వతీపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. కురుపాం ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి చేయుటకు ముఖ్య మంత్రి చర్యలు చేపట్టారని ఆమె చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం స్ధానిక లయన్స్ క్లబ్ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో గొప్ప సంతృప్తి వస్తుందన్నారు. చిన్నారులను బంగారు ముద్దగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులే అన్నారు.