వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కిరాణా మర్చంట్ అసోసియేషన్ మరియు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు రెయిన్ కోటులను అందించడం అభినందనీయమని గుంటూరు ఈస్ట్ డిఎస్పి అజీజ్ అన్నారు. గురువారం సాయంత్రం లాలాపేట పోలీస్ స్టేషన్లో డిఎస్పీ అజీజ్, గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి రెయిన్ కోటులను అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ అజీజ్, ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కిరాణా మర్చంట్ అసోసియేషన్ మరియు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు రెయిన్ కోటులను అందించడం అభినందినీయం అన్నారు. కృతజ్ఞతలు తెలియజేశారు.