చిన్న శంకరంపేట మండలం గవలపల్లి పరిధిలోని అగ్రహారం గ్రామంలో వట్టెం మహేష్ అనే వ్యక్తితో వెల్దుర్తి మండలం శేరిళ్ల గ్రామానికి చెందిన పూజతో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. శనివారం సాయంత్రం ఉరి వేసుకుని మృతి చెందిందని పూజ తండ్రి సాయిలుకు సమాచారం అందించగా అదనపు కట్నం కోసమే తన కూతురిని హత్య చేశారని మహేష్ ఇంటిని బంధువులు కుటుంబ సభ్యులు ధ్వంసం చేశారు గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది విషయం తెలుసుకున్న ఎస్సై నారాయణ గౌడ్ రామయంపేట సిఐ వెంకట్ రాజు గౌడ్ వారి సిబ్బందితో కలిసిగ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఘటన స్థలం చేరుకొన్నారు.