స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, విద్యుత్ ఛార్జీలుతగ్గించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ,సీఐటీయూ, ఏఐవైఎఫ్ నాయకులు గురువారంపత్తికొండలో ధర్నా చేశారు. 25 ఏళ్ల క్రితం బషీరాబాగ్కాల్పుల్లో మృతిచెందిన అమరవీరులకు నివాళులుఅర్పించారు. కార్య క్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులురామచంద్రయ్య, ఈరన్న, సురేంద్ర, రామాంజనేయులు,సీపీఎం నాయకులు వెంకటేశ్వర రెడ్డి, రవిచంద్ర, గోపాల్,దస్తగిరి పాల్గొన్నారు.