అరకులోయ మండలంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో యూరియా కొరత మరియు ఇతర రైతాంగ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న రైతులకు బాసటగా,రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 9న ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు,రైతన్నకు బాసటగా పోస్టర్నుఅరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ మొదలై నాలుగు నెలలు కావస్తున్న ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి రైతులకు యూరియా పంపిణీ చేయకపోవడం దారుణమని వాపోయారు.ఎరువులు పంపిణీ చేయకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు.