అనంతపురం జిల్లాకు రావాలంటే యూరియాతో రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు బిఫోర్ కాకి ఎత్తుకెళ్లిందని సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చిన తర్వాత జిల్లాకు రావాలని తెలిపారు.