మంగపేట మండలం మల్లూరులోని రామాలయం నుండి మెట్టుగూడం వరకు గత 8 నెలలుగా తాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాగా, శుక్రవారం ఉదయం నేడు స్థానికులు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు కాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తమకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.