Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 24, 2025
భారీ వర్షాలు, గోదావరి వరదలు కారణంగా సుమారు 45 రోజులుగా పాపికొండల విహారయాత్ర నిలిచిపోయింది. దేవీపట్నం నుంచి ప్రతి రోజు పాపికొండల విహారయాత్రకు పర్యాటకులతో బోట్లు ప్రయాణించేవి. భారీ వర్షాలు, గోదావరి నదికి వరదలు కారణంగా నీటిమట్టం భారీగా పెరగడంతో అధికారులు బోట్లు తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇవి నిలిచిపోయి 45 రోజులైందని వాటి యజమానులు చెబుతున్నారు.