విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని ఓ గిరిజన కుటుంబం పిడుగుపాటుకు గురైంది. మండలంలోని మునుపురాయి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. సింబోయిన బుధరమ్మ ఇంటి పక్కనే పిడుగు పడటంతో ఆమె కొడుకు, కోడలు సొమ్మసిల్లిపోయారు. దబ్బగుంట వరకు డోలితో తరలించి ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి ఆటోలో తరలించారు. వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.