కర్రల సమరం.. ఈ పేరు వినగానే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. జిల్లాలోని హొళగుంద మండలంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఈనెల 27న గణపతి పూజ, స్వామివారి కంకణ ధారణ, నిశ్చితార్థం, ధ్వజారోహణంతో ప్రారంభించనున్నారు. అక్టోబర్ 2న బన్నీ ఉత్సవం ఉంటుంది. ఇందులో ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు.